టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సాధారణంగా ఒకసారి పెద్ద హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలు ఆ ఒక్క మూవీ తీసి స్టార్ డైరెక్టర్లుగా పేరు సంపాదించుకున్న డైరెక్టర్స్ చాలామందే ఉన్నారు. కానీ కెరియర్ మొదట్లోనే మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన రెండో మూవీ బాధ్యత ను తీసుకున్న డైరెక్టర్ సంపత్ నంది గారు. ఐనా ఆయన ఇప్పటికి కూడా టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందలేదు.

ఈయన తీసిన మొదటి సినిమా వరుణ్ సందేశ్ హీరో గా చేసిన 'ఏమైంది ఈవేళ '. ఆ మూవీ ఐతే సూపర్ సక్సెస్ అయింది దాంతో రెండో సినిమానే రామ్ చరణ్ తో తీసి ఓకే పర్లేదు అనే పేరు సంపాదించు కున్నప్పటికి ఆ తర్వాత రవితేజ తో తీసిన బెంగాల్ టైగర్,గోపిచంద్ తో తీసిన గౌతమ్ నంద సినిమాలు యావరేజ్ గా ఆడడంతో ఆయన స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయారు అయనకన్న వెనకాల డైరెక్టర్స్ అయిన కొరటాల శివ, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్ స్టార్ డైరెక్టర్లు గా మారి స్టార్స్ తో సినిమాలు చేస్తుంటే సంపత్ నంది మాత్రం ఇంకా గోపిచంద్ లాంటి సెకండ్ గ్రేడ్ హీరోల దగ్గరే ఆగిపోయారు. ఐతే ప్రెసెంట్ ఆయన నాగార్జున తో ఒక సినిమా ప్లాన్ చేయబోతున్నారు అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల నుండి వచ్చినప్పటికీ అది అఫిషియల్ గా ఇంకా అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.అలాగే నాగార్జున ప్రెసెంట్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ టైం లో సంపత్ నంది కి నాగార్జున ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే వేచి చేసి చూడాల్సిందే.సంపత్ నంది సినిమాలు సరిగ్గా అడకపోవడానికి కారణం ఏంటంటే  ఆయన చేసిన సినిమాలు రొటీన్ గా ఉంటాయి అనే టాక్ ఇండస్ట్రీలోను మరియు ప్రేక్షకుల్లో ఉంది. ఐతే ఇప్పుడైనా ఒక మంచి కథతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కట్టాలని సోషల్ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: