విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దొరసాని సినిమాతో హీరో గా పరిచయమైన ఈయన ఇప్పుడు పలు సినిమాలలో నటిస్తూ పర్వాలేదనిపించుకుంటున్నాడు. ఇకపోతే తన సినిమాలతో అన్న విజయ్ దేవరకొండ లాగా పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆనంద్ దేవరకొండ.. తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు.. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఆనంద్ దేవరకొండకు బర్తడే విషెస్ తెలియజేసింది.. హ్యాపీ బర్తడే ఆనంద్ దేవరకొండ అంటూ ఫన్నీ గా ఉండే ఏమోజీ ని కూడా షేర్ చేసింది రష్మిక. అయితే దీనికి ఆయన రిప్లై ఇచ్చిన తీరు అందరిని ఆశ్చర్యానికి రష్మిక విషెస్ కు ప్రతిస్పందనగా థాంక్యూ రష్ అంటూ కామెంట్ చేశాడు.

ముఖ్యంగా ఇది చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు షాక్ అవుతున్నారు.. ఆనంద్ దేవరకొండ ఏంటి రష్మికను అలా పిలిచాడు అంటూ ప్రతి ఒక్కరు తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే గత కొన్ని రోజులుగా విజయ్ , రష్మికల మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.  అంతేకాదు రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్ కి అయినా సరే తప్పకుండా హాజరవుతుంది.. అందుకే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నా.. వీటిపై వీరిద్దరూ ఏ రోజు కూడా క్లియర్ గా ఓపెన్ అవ్వలేదు.

అటు విజయ్ దేవరకొండ కూడా ఈ వార్తలపై స్పందించకుండా తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు.  మరొకవైపు రష్మిక  కేవలం  పుష్ప 2 లో మాత్రమే బిజీగా ఉంది. ఇక ఈ సినిమా పూర్తి అయితే ఆమె ఖాళీగా ఉండాల్సిందే అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఇకనైనా రష్మిక హక్కులు వస్తాయో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: