

అయితే తాజాగా దీప్తికి షణ్ముఖ్ బర్తడే విషెస్ కూడా చెప్పడంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే ఇవన్నీ కూడా వట్టి పుకార్లే అన్నట్లుగా సమాచారం. షణ్ముఖ్ తాజాగా అయ్యయ్యో అని ఒక టైటిల్ తో ప్రాజెక్టుని మొదలుపెట్టారు. దీనిలో షణ్ముఖ్ కు జంట గా ఫణి పూజిత అనే అమ్మాయి నటిస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే దీప్తి, షణ్ముఖ్ మధ్య దూరం అలాగే ఉందనే వార్త వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్-5 లో షణ్ముఖ్.. సిరి తో చాలా సన్నిహితంగా ఉండడంతో పాటు రొమాన్స్ కూడా చేయడంతో స్నేహితులమని చెబుతూ కాస్త హద్దులు మీరడంతో దీప్తి, షణ్ముఖ్ మధ్య బ్రేకప్ కారణాలు ఇదే అంటూ వైరల్ గా మారాయి.

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తన నచ్చని కారణంగానే దీప్తి.. షణ్ముఖ్ నుంచి దూరమైందని ప్రచారం జరుగుతోంది. యూట్యూబ్ ద్వారా మొదట వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అనేక వెబ్ సిరీస్లలో కూడా నటించారు. తాజాగా దీప్తి చీరకట్టులో తన బ్యాక్ అందాలను చూపిస్తూ కురులతో అందరిని ఆకట్టుకుంటోంది. చీర కట్టులో ఈ అమ్మడి అందాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవటం లేదంటూ పలువురు నెటిజన్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈమె కళ్ళు .. మెడ కింద నెక్లెస్ హైలెట్గా కనిపిస్తున్నాయి.