రష్మిక మందన్న .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ కొట్టేస్తూ సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లోకి చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి.. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా సూపర్ హిట్ సాధించి స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చింది. ఇక మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు  సూపర్ హిట్ సాధించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇంకేముంది అందరి హీరోలు తమ సినిమాల్లో రష్మిక అయితే బాగుంటుందని సజిషన్స్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. మిడ్ రేంజ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో జోడి కట్టి మంచి విజయాల సాధిస్తుంది రష్మిక మందన. అయితే గతంలో నటించిన స్టార్ హీరో తోనే ఇక ఇప్పుడు మరోసారి జోడి కట్టెందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. యువ హీరో నితిన్ తో జోడి కట్టి భీష్మ అనే సినిమాలో నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక వెంకి కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందట. మరోసారి నితిన్ తో జోడి కట్టేందుకు రష్మిక మందన సిద్ధమైంది. అయితే ఈ సినిమాకు భీష్మ డైరెక్టర్ వెంకి కుడుములే దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఇంట్రడక్షన్ వీడియోతోనే సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని క్రియేట్ చేశారు అని చెప్పాలి. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ను అనౌన్స్ చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఇక గత కొంతకాలం నుంచి సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న నితిన్ కు మరోసారి ఈ హిట్ కాంబినేషన్ ఫామ్ లోకి తీసుకువస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: