అక్కినేని అఖిల్ కెరియర్ ప్రారంభంలో నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యువ హీరో కు ఆశించిన రేంజ్ విజయాలను అందించ లేదు. అలాంటి సమయం లోనే ఈ యంగ్ హీరో టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

మూవీ లో పూజా హెగ్డే ... అఖిల్ కు జోడి గా నటించింది. ఈ మూవీ తో కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని అందుకున్న అఖిల్జోష్ లో ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో సాక్షా వైద్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నాడు. మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ  వెరీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది.

సినిమా అఖిల్ కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ గా రూపొందుతూ ఉండడం అలాగే ఇప్పటివరకు ఈ చిత్రం నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు సూపర్ గా ఉండడం అలాగే ఈ మూవీ లోని అఖిల్ బాడీ డైలాగ్ డెలివరీ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొని నిన్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ స్థాయి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. ఈ మూవీ ని ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: