తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించిన ఈ యువ హీరో ఇప్పటికే కొన్ని విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని హీరో గా తన కంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లో మంచి విజయం సాధించిన సినిమాలలో జయ జానకి నాయక మూవీ ఒకటి.

మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడు గా మంచి గుర్తింపును తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించక జగపతి బాబు ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇ

లా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా హిందీ లో జయ జానకీ నాయక ఖోంఖర్ పేరిట యూ ట్యూబ్ లో 8 ఫిబ్రవరి 2019 లో విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూట్యూబ్ లో ఆల్ టైం రికార్డు ను క్రియేట్ చేసింది. ఈ మూవీ యూట్యూబ్ లో 700 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఒక సినిమా 700 మిలియన్ వ్యూస్ ను సాధించడం ఇదే మొట్ట మొదటి సారి. ఇలా జయ జానకి నాయక మూవీ సరికొత్త రికార్డు ను సృష్టించింది. ఇది ఇలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం చత్రపతి రీమిక్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ తో హిందీ లోకి యువ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: