యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ... కొరటాల శివ దర్శకత్వం లో రూపొంద బోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొంద బోతుంది . దీనితో ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ఫిక్స్ చేయని నేపథ్యం లో ఈ మూవీ ని ఎన్టీఆర్ 30 అనే పేరుతో చిత్ర బృందం అనౌన్స్ చేసింది . కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా ప్రారంభం అయింది .

మూవీ యొక్క పూజా కార్య క్రమాలకు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ... టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ అప్పుడు ప్రారంభం కాబోతోంది ... ఇప్పుడు ప్రారంభం కాబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక కేజీ న్యూస్ బయటకు వచ్చింది .

అసలు విషయం లోకి వెళితే ... ఎన్టీఆర్ .... కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ నిన్న రాత్రి నుండి ప్రారంభం అయినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం రాత్రి సన్నివేశాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ మూవీ చిత్రీకరణను నిన్న రాత్రి నుండి ప్రారంభించినట్లు సమాచారం. చిత్ర బృందం ప్రారంభించిన లేటెస్ట్ షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ పది రోజుల షెడ్యూల్లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: