నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పటాస్ సినిమాతో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత సుప్రీమ్ ... రాజా ది గ్రేట్ ... ఎఫ్  2 ... సరలేను నీకెవ్వరు ... ఎఫ్ 3  వంటి మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ లో బాలయ్య సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ మూవీ యూనిట్ గణేశుడిపై సాగే పాట కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెట్‌ లోనే బాలయ్య ... శ్రీ లీల పై ఎంతో గ్రాండ్‌ గా ఈ పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ చిత్రీకరణకు ఏకంగా 5 కోట్లు ఖర్చు కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: