బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఆ మధ్య షోలకు కాస్త గ్యాప్ ఇచ్చిన విష్ణు ప్రియా తాజాగా  మళ్ళీ వరుస షో లతో యాక్టివ్ అవుతుంది. గతంలో తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది విష్ణు ప్రియ. ఈ టీవీ లో ఒక షోలో పాల్గొంది విష్ణు ప్రియ. ఇక  ఆ షో లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఆమె మాట్లాడిన మాటలు పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అసలు విషయం ఏంటంటే తాజాగా సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న సుమ అడ్డ షోలో పాల్గొంది విష్ణు ప్రియ. 

ఇందులో ఆమెతోపాటు ధనరాజ్ ,చమ్మక్ చంద్ర, బలగం వేణు సైతం రావడం జరిగింది. వీరందరూ కలిసి  నవ్వులు పూయించారు. తమదైన కామెంట్లు పంచులు సెటైర్లతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు .అంతేకాదు పంచులతో బాగానే ఎంటర్టైన్ చేశారు. అయితే ఈ షోలో విష్ణు ప్రియ చేసిన కామెంట్లు ఆమె చేసిన చేష్టలు చాలా హైలైట్ గా మారాయి. ఇక  వచ్చిన వారందరికీ ఒక టాస్క్ ఇచ్చింది సుమ. పెళ్లి అనగానే ఏం గుర్తొస్తుంది అంటూ వారిని అడుగుతుంది.. ఇందులో భాగంగా విష్ణు ప్రియ షాపింగ్ బంధువులు అని చెప్పకు వచ్చింది. శుభలేఖలు కళ్యాణమండపం బంగారం అని చెక్క చెడు ధనరాజ్.

అయితే ఇంతలోనే విష్ణు ప్రియ రియాక్టర్ తో శోభనం అంటూ చెప్పేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు. ఆ వెంటనే రియాక్ట్ అయిన దర్శకుడు వేణు శోభనం గుర్తొచ్చింది కానీ నీకు తాళిబొట్టు గుర్తుకు రాలేదా అంటూ విష్ణు ప్రియ పై సెటైర్ వేశాడు. దీంతో ఒక్కసారిగా షోమొత్తం దద్దరిల్లింది.అనంతరం తాళిబొట్టు చెప్పలేకపోయానే అన్న నిరుత్సాహంతో విష్ణు ప్రియ ముఖం వాడిపోయింది. ఇక ఈ వీడియో చూసిన సదరు నెటిజెన్స్ పెళ్లి అంటే ఎవరికైనా శోభనం గుర్తొస్తుందా అంటూ విష్ణు ప్రియ పై దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: