
ఇప్పుడు v మెగా పిక్చర్ తో కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. తన మొదటి సినిమానే హీరో అఖిల్ తో కలిసి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. కొత్త ప్రొడక్షన్ బ్యానర్ను స్థాపించిన రామ్ చరణ్ కు అభిమానులు పలువురు నేటిజన్లు సైతం ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో పలు సినిమాలను నిర్మించిన రామ్ చరణ్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్-150, సైరా తదితర చిత్రాలను ఈ బ్యానర్ లోనే రూపొందించారు.
ఇక రాంచరణ్ సినిమా విషయాలకి వస్తే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తూ ఉండగా.. అంజలి శ్రీకాంత్ ఎస్ జె సూర్య తదితరులు సైతం కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తూ ఉన్నారు దిల్ రాజు నిర్మాణ బాధ్యతలను నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.రామ్ చరణ్. మరి ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన రామ్ చరణ్ ఏ మేరకు సక్సెస్ అవుతారు చూడాలి మరి.