సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కెరియర్ పరంగా మరింత బిజీ అయింది సమంత .హాలీవుడ్ ప్రాజెక్టుల కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మరింత బిజీగా మారింది సమంత. పెళ్లయి నాలుగేళ్లు కూడా పూర్తిగా ముందే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.ఇక విడాకుల తర్వాత ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న సమంత వాటన్నిటిని ఎదుర్కొంటూ వరుస సినిమాలను చేస్తోంది సమంత .

 దాంతో పాటు మయోసైటీస్ అనే ఒక అరుదైన వ్యాధి బారినపడి ధైర్యంగా పోరాడి బయటకు వచ్చింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వయసు ప్రాజెక్టులతో బిజీగా మారింది సమంత.అయితే తాజాగా సమంతకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే సమంత ఎప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని డబ్బులు సంపాదించడం పైనే పెట్టిందని తెలుస్తోంది. దానికి ఒక ముఖ్య కారణం కూడా ఉందట. హీరోయిన్ల కెరియర్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎంత అందం టాలెంట్ ఉన్నా కూడా ఎప్పటికీ ఒకేలాగా సంపాదించలేం. 

ఒకటి రెండు దశాబ్దాలు హీరోయిన్లుగా కొనసాగుతారు.ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లలో చేస్తారు. మరి కొందరు సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమవుతారు. వయసు పెరిగే కొద్దీ సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గుతూ వస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోయిన్లే కావాలని అంటున్నారు. సమంతకి ప్రస్తుతం మూడు పదుల వయసు.ఇక 40 కి దగ్గర అయితే ఆమెకి క్రమంగా అవకాశాలు కూడా తగ్గుతాయి. అందుకే ఉన్న సమయంలోనే గట్టిగా సంపాదించాలని నిర్ణయించుకుందట సమంత. అందుకే వీలైనంత ఎక్కువ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: