గత కొంతకాలంగా మంచి ఫామ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడుట కొరటాల శివ. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో పార్టీ ఎన్టీఆర్ 31 సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

 ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన దగ్గర షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతున్న... ఫుల్ లెన్త్ యాక్షన్ గా ఈ సినిమా రాబోతోందని అంటున్నారు. కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా ఎవరన్నా విషయం పై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు అలియా భట్ శ్రద్ధ కపూర్ దీపిక పదుకొనే వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరొక వార్త వైరల్ అవుతుంది.

అది ఏంటంటే ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా నటించబోతుందని అంటున్నారు. కాగా ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్వహించబోతున్నారట.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో కూడా భాగమే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఏ విషయం నిజమా కాదా అన్నది తెలియాలంటే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేయాలి .దీంతో జూనియర్ ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది అన్న వార్త తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: