పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా ఆది పురుష్ సినిమా తెరకెక్కింది.ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తూ ఉండగా సీత పాత్రలో కృతి సనన్ కనిపిస్తుంది.వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ సినిమాని తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేయగా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయిన టీ సిరీస్ సంస్థ ఈ సినిమాని ఏకంగా 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించింది.ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో కనిపిస్తూ ఉండడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. కేవలం దక్షిణాది ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల కూడా సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. దేశావ్యాప్తంగా ఇప్పుడు ఆదిపురుష్ సినిమా మీద మాత్రం విపరీతమైన బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7వేల థియేటర్లలో రిలీజ్ అవుతుంది.


ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం 1100 థియేటర్లలో ఆది పురుష్ సినిమా విడుదల అవుతుంది. ఇక కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 185 థియేటర్లలో ఆది పురుష సినిమా రిలీజ్ అవుతుంటే తమిళనాడులో 170 థియేటర్లలో ఇంకా కేరళలో 150 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక హిందీ సహా మిగతా భారతదేశం అంతా కలిపి మొత్తం 3300 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంటే ఒక్క ఓవర్సీస్ లోనే ఈ సినిమా 2,100 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 7000 కు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.ఇప్పటి దాకా ఒక్క షో కూడా పడలేదు కానీ సినిమా మీద మాత్రం విపరీతమైన బజ్ అనేది ఏర్పడుతోంది.ఇక ఫస్ట్ డే ఈ మూవీ 150 నుంచి 200 కోట్ల దాకా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఈ మూవీ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో..

మరింత సమాచారం తెలుసుకోండి: