పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. 500 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా.. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కింది. 3డి టెక్నాలజీ తో థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తుంది అని చెప్పాలి. అయితే మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ తో ముందుకు సాగుతున్న ఈ మూవీ అటు కలెక్షన్స్ విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తుంది అనడంలో ఓ సందేహం లేదు.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో కనిపించింది. ఇద్దరు కూడా సీతారాముల పాత్రకి న్యాయం చేస్తూ ఎంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు అని చెప్పాలి. అయితే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో.. చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఆది పురుష్ సినిమాలో రాముడి పాత్ర కోసం ఎందుకు ప్రభాస్ ని హీరోగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది అనే విషయం గురించి డైరెక్టర్ ఓం రౌత్ ఇటీవల ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఆది పురుష్ సినిమా తీయాలి అనుకున్నప్పుడే రాముడిగా ప్రభాస్ మాత్రమే సరైన ఎంపిక అని నేను అనుకున్నాను అంటూ ఓమ్ రౌత్ తెలిపాడు. ఈ పాత్రకు ప్రభాస్ ఖచ్చితంగా సరిపోతాడని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ కళ్ళల్లో నీతి నిజాయితీ కనిపిస్తూ ఉంటాయి. ఎంత పెద్ద స్టార్ అయినా సరే వినయంగా ఉంటారు. అయితే ఈ పాత్ర చేయడానికి ప్రభాస్ ను ఒప్పించడానికి మాత్రం ఎంతగానో కష్టపడ్డాం. చివరికి ఒప్పించి అన్ని విధాల ఈ సినిమాకు ప్రభాస్ సపోర్ట్ చేశారు అంటూ ఓమ్ రౌత్ చెప్పుకొచ్చాడు. అయితే సినిమా చూసిన తర్వాత కూడా ప్రభాస్ అచ్చం రాముడిలాగే ఉన్నాడని.. మరొకరు ఈ పాత్ర చేసి ఉంటే సెట్ అయ్యేది కాదని ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి