టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలు నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న తేజ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సినిమాల్లో హీరోగా కూడా తేజ నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ యువ నటుడు కొంత కాలం క్రితం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన జాంబీ రెడ్డి అనే సినిమాలో హీరోగా నటించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఈ మూవీ తర్వాత ఈ నటుడు అద్భుతం అనే టైమ్ ట్రావెలర్ జోనర్ లో రూపొందిన అద్భుతం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తేగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఆగస్టు 25 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరి కొన్ని రోజుల్లోనే అఫీషియల్ గా ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే తేజ ... ప్రశాంత్ కాంబినేషన్ లో రూపొందిన జాంబి రెడ్డి మూవీ మంచి విజయం సాధించడంతో హనుమాన్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: