తెలుగు సినిమా ఇండస్ట్రీ.లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు కొత్త బంగారు లోకం అనే సినిమాతో దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభించి ఈ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. 

ఈ రెండు మూవీ లతో ఈ దర్శకుడి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ గా పెరిగి పోయింది. ఆ తర్వాత ఈ దర్శకుడు ముకుంద సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు అసురన్ అనే తమిళ సినిమాకు రీమేక్ గా రూపొందిన నారప్ప అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం ఈ దర్శకుడు "పెదకాపు 1" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తంగా ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే "పెద్దకాపు 1" మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసింది.

"పెద్దకాపు 1" మూవీ యొక్క టీజర్ విడుదల తేదీని ... సమయాన్ని ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క టీజర్ ను జూలై 2 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: