లోక నాయకుడు కమల్ హాసన్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఇటీవల విక్రమ్ సినిమాతో తిరుగులేని కం బ్యాక్ ఇచ్చాడు కమలహాసన్. ఇక అదే జోష్ లో ప్రస్తుతం ఇండియన్ టు సినిమా చేస్తున్నాడు కమల్ హాసన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. శంకర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత కమల్ మణిరత్నంతో ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 36 సంవత్సరాలు తర్వాత వీరిద్దరి కాంబినేషన్

 రానుండడంతో ఆ సినిమాపై ఇప్పటికే భారీ రేంజ్ లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళనన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో శింబు సైతం ఒక కీలక పాత్రలో కనిపించినట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత బలిమై తెగింపు సినిమాల దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడట కమల్ హాసన్. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు

సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా కథ రైతుల సమస్యల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. వాళ్ళ కష్టాలను అడ్రస్ చేస్తూ కథను రాస్తున్నారట. కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం చేయనున్నారట. ప్రస్తుతం కమలహాసన్ ఇండియన్ టు సినిమాతో బిజీగా ఉన్నాడు. సిద్ధార్థ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ స్వరాగాలను అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. దీంతో ఒక బలహాసన్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: