పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా బ్రో ధి అవతార్. అయితే ఈ సినిమా ఈనెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ని చాలా గ్రాండ్గా ప్రారంభించబోతున్నారు చిత్ర బృందం. అయితే ఈటీవీలో ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన తమన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ త్రివిక్రమ్ గారు స్క్రీన్ ప్లే చెప్పినప్పుడే అందరికీ రోమాను నిక్కబడుచుకున్నాయి. ఈ సినిమా అందరిని కదిలిస్తుంది. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది దాంతోపాటు జీవితం అంటే ఏంటో తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది.. 

అంతేకాదు సున్నితమైన అంశాలు ఈ సినిమాలో చాలానే ఉంటాయి.. అంటూ ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చాడు థమన్. అయితే ఆయన మాట్లాడిన ఈ మాటలు ఈ సినిమాపై అంచనాలో మరింత పెంచేలాగా ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా సాయి ధరంతేజ్ మరొక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఇటీవల ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. ఇక ఆ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే మొన్న విడుదలైన పాటకి మాత్రం అభిమానుల నుండి పెద్దగా రెస్పాన్స్ లభించలేదు అని చెప్పాలి .

అయితే ఈ విషయాన్ని తమను రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొన్న విడుదల చేసిన పాట అభిమానులకు నచ్చలేదని అన్ని పాటలు అభిమానులకు నచ్చాలని రూలేమీ లేదు అని.. తర్వాత వచ్చే పాటలు మాత్రం అభిమానుల రోమాలు నెక్కబడుచుకునేలా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు. అయితే బ్రో మోషన్ పోస్టర్లో వచ్చే శ్లోకం మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ ని ఎంతలా ఆకట్టుకుందో మనం చూసాం. ఇకపోతే ఈ శ్లోకం ఫుల్ వెర్షన్ ని ఈ శనివారం కానీ లేదా ఆదివారం కానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందంమ్ అయితే కచ్చితంగా ఈ పాట ఫ్యాన్స్ కి నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాడు థమన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: