తెలుగులో రెండే జస్ట్ ఒక్క వీడియోతో క్రేజ్ తెచ్చుకున్న ప్రియా వారియర్.. తెలుగులో నితిన్ 'చెక్', తేజా సజ్జా 'ఇష్క్' సినిమా ల్లో నటించింది. కానీ ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈమె నటించిన గత మూడు చిత్రాలు మలయాళంవే. అవి కూడా ఏమంత చెప్పుకోద్దగ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేదు. ప్రస్తుతం ఈమె 'బ్రో' మూవీ పైనే ఆశలు పెట్టుకుంది.పాక్‌లో ఫ్యాన్స్
బాలీవుడ్ పలువురు పాక్ సింగర్స్, నటులు ఉంటారు కానీ మన యాక్టర్స్ కి దాయాది దేశంలో పెద్దగా అభిమానులు ఉండరు. అలాంటిది ప్రియా వారియర్ కన్ను గీటిన వీడియోకు పాక్ కుర్రాళ్లు పడిపోయారు. దీని గురించి స్వయంగా ఈ బ్యూటీనే చెప్పింది. దేనికి కనెక్ట్ కానీ పాక్ ప్రేక్షకులకు తన వీడియో తెగ నచ్చేసిందని, రోజూ మెసేజులు పెట్టేవారని, బాగా చేశావని మెచ్చుకున్నారని చెప్పింది. మీ కోసం ఇక్కడ అభిమాన సంఘాలు ఉన్నాయని వాళ్లు చెబుతుంటే నమ్మలేకపోయేదాన్నని ప్రియా వారియర్ పేర్కొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి