అయితే ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ ని విడుదల చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా టైటిల్ ని పలు రకాల పేర్లతో రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ అలాంటి రూమర్లకు చెక్ పెడుతూ కల్కి 2898 AD అని తెలియజేయడం జరిగింది.. కల్కి సినిమా గ్లింప్స్ విజయానికి వస్తే ఈ సినిమాని భారీ తారాగణంతో చూపించారు ఈ వీడియో విడుదల తర్వాత ప్రభాస్ అభిమానులు ఈ సినిమా పైన పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుందని నమ్మకంతో ఉన్నారు.
ప్రపంచాన్ని ఒక దుష్ట శక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవించే విధంగా ఈ సినిమా కథను తెరకెక్కించినట్లు కల్కి సినిమా టీజర్లో కనిపిస్తోంది. ఆశక్తి ప్రభాస్ గా చూపించారు. ఈ కథలో టైం ట్రావెల్ గురించి కూడా హింట్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది అలాగే హీరోయిన్ దీపికా పడుకొనే సన్నివేశాలు కూడా అక్కడక్కడ చూపించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే ఈ చిత్రం ఒక పాన్ వరల్డ్ మూవీ చిత్రం అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలియజేయడం జరిగింది. ఈ చిత్రంలో ప్రభాస్ లు చూస్తూ ఉంటే ఈ విషయం నిజమే అన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఏ మాత్రం ప్రభాస్ అభిమానులను గ్లింప్స్ ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి