ప్రశాంత్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో వచ్చిన జోడి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి త్రిష కృష్ణన్. ఈమె మోడలింగ్లో రాణించి మిస్ చెన్నై పోటీ గెలవడంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.ఇక త్రిష తమిళంలో మౌనం పెసి యాదే,గిల్లి, సామి, ఆరు వంటి సినిమాల్లో నటించింది.ఇక తెలుగులో ఈ హీరోయిన్ నటించిన మొదటి సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వర్షం సినిమాలో నటించింది.ఇక నటించిన మొదటి సినిమానే హిట్ అవడంతో త్రిషకి మంచి పేరు వచ్చింది. అంతేకాదు ఆ తర్వాత వరుస అవకాశాలతో ప్రస్తుతం 40 ప్లస్ లో కూడా చేతినిండా అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక 40 ఏళ్లు వచ్చినా కూడా ఈ హీరోయిన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇక ఈ మధ్య కాలంలో విడుదలైన పొన్నియన్ సెల్వన్ 2 లో త్రిష అందానికి ఎంతోమంది మంత్ర ముగ్ధులయ్యారు.

అయితే చాలామంది హీరోయిన్లకు 35 ఏళ్ళు దాటడంతోనే ముడతలు పడ్డ ఫేస్ కనిపిస్తుంది. అలాంటిది త్రిష 40+ లో ఉన్నా కూడా ఇంకా యంగ్ గా 20 ఏళ్ల అమ్మాయిగా కనిపించడానికి ప్రధాన కారణం ఆమె అందంగా ఉండడం కోసం మెడికల్ ఇంజక్షన్స్ వేయించుకుంటుందట.అవును ఇండస్ట్రీ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. త్రిష అవకాశాల కోసం తన అందం అలాగే ఉండాలనే ఉద్దేశంతో అందానికి సంబంధించిన మెడికల్ ఇంజక్షన్లు వేయించుకుంటుందని తెలుస్తోంది. అందానికి సంబంధించిన మెడికల్ ప్రొడక్ట్స్ తో పాటు ఇంజక్షన్స్ వేయించుకోవడం వల్ల త్రిష 40 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా 20 ఏళ్ల అమ్మాయిలానే కనిపిస్తోందట.ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అయితే చాలామంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే 40 ప్లస్ లో కూడా త్రిష అలా ఉండడం చూసి నిజంగానే త్రిష ఇంజక్షన్స్ వేయించుకుంటుందని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: