తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లుగా కొనసాగుతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ... రెబల్ స్టార్ ప్రభాస్ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వీరికి సంబంధించిన మూవీ ల షూటింగ్ లు ఎక్కడ జరుగుతున్నాయి ... ప్రస్తుతం ఆ మూవీ లు ఏ స్థితిలో ఉన్నాయి అనే వివరాలను తెలుసు కుందాం.

దేవర : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందుతున్న ఈ సినిమాకు ప కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు . ఇకపోతే ఈ మూవీ బృందం ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ కి సంబందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .

గేమ్ చేంజర్ : రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ పై హైదరాబాద్ ఔట్ కట్స్ లో ఈ మూవీ బృందం కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. 

పుష్ప పార్ట్ 2 : అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం అల్లు అర్జున్ పై కొన్ని ప్రత్యేక సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తుంది. 

కల్కి 2898 ఏడి : ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. 

ఇకపోతే ఈ నాలుగు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: