సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం బిజినెస్ మాన్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా 2012 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాను తిరిగి తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కాయి. ఈ మూవీ.కి రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా నైజాం ఏరియాలో మొదటి రోజు 2.46 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ లో 35 లక్షలు ... యుఏ లో 42 లక్షలు ... ఈస్ట్ లో 34 లక్షలు ... వెస్టులో 15 లక్షలు ... గుంటూరులో 31 లక్షలు ... కృష్ణలో 27 లక్షలు ... నెల్లూరులో 7 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 4.37 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ లో భాగంగా ఏ సినిమా కలెక్ట్ చేయని రేంజ్ లో కలెక్షన్ లను వసూలు చేసి ఆల్ టైం రికార్డును నమోదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: