కిరణ్ అబ్బవరం నేహా శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ సినిమాలోని ఒక పాట సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది ..ఆ పాటనే సమ్మోహనుడా అనే సాంగ్.. ఈ పాట మంచి పాపులారిటీ సంపాదించు కోవడంతోపాటు ఈ పాటలు నేహా శెట్టి అందాల ఆరబోత కూడా కుర్రకారుల మతి పోగొట్టేలా చేయడమే కాకుండా డాన్స్ తో మరింత ఆకట్టుకుంది. ఈ పాటకి సోషల్ మీడియాలో సెలబ్రెటీలు పలువురు ప్రేక్షకులు కూడా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.


ఇప్పుడు తాజాగా ప్రముఖ యాక్టర్ సురేఖవాణి తన కూతురు సుప్రీత ఈ పాటకి డాన్స్ వేయడంతో పాటు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ గా మారుతోంది.. సురేఖ వాణి తన కూతురు ఎప్పుడు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.. ఇక అప్పుడప్పుడు పబ్బులకి పార్టీలు వంటివి చేస్తూ ఉంటారు.. తాజాగా చీర కట్టులో సురేఖవాణి సుప్రీత డాన్స్ చేస్తున్న విధానం అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.


సమ్మోహనుడా అనే సాంగ్ కు అదిరిపోయేలా డాన్స్ వేయడంతో సోషల్ మీడియాలో ఈ పాటలో మరింత గ్లామర్ గా కనిపిస్తున్నారు ఈ తల్లి కూతుర్లు.. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖవాణి బాగానే రాణిస్తోంది తల్లి వదిన వంటి పాత్రలలో మంచి పాపులారిటీ అందుకుంది.. ఇక సురేఖ వాణి తన కూతురిని సైతం హీరోయిన్ గా చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది..ఈ మధ్యనే ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖవాణి తన కూతురు పేర్లు వినిపించగా సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో ఈ విషయం పైన తమకు ఎలాంటి సంబంధం లేదని విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: