అయితే ఈ సినిమాకి ముందే.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో కలిసి ఒక మూవీని ఓకే చేశారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత చేయాలనుకున్నది.. భోళా శంకర్ సినిమా ఫ్లాప్ గా మిగలడంతో ఈ విషయంలో చిరంజీవి కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే బ్రో డాడి అనే సినిమా రీమిక్స్ చేయాలనుకున్న.. భోళా శంకర్ సినిమా పరిస్థితి రావడంతో చిరంజీవి ఈ సినిమా ఇప్పుడు ఎందుకులేని ఆలోచనలో పడినట్లు సమాచారం.
అంతేకాకుండా నిర్మాతగా ఉన్న తన కుమార్తె కూడా నష్టపోవాల్సి వస్తుందని చిరంజీవి భావించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.. తన పుట్టినరోజు కూడా ఈ సినిమా నుంచి ఏ విధమైన అప్డేట్ కూడా ఇవ్వకపోవడం అందుకు కారణమని సమాచారం.. బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో యువ్వి క్రియేషన్ బ్యానర్ పైన ఒక సినిమాని నిర్మిస్తున్నారు.ఇక వశిష్ట తో తెరకెక్కిస్తున్న సినిమా చాలా భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా పైన అంచనాలు భారీగానే పెరిగిపోతున్నాయి.. మరి చివరికి చిరంజీవి ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తారేమో చూడాలి మరి.. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి