
జగపతిబాబు మాట్లాడుతూ.....రుద్రంగి కథ నచ్చడం తో రెమ్యునరేషన్ తగ్గించుకొని ఈ సినిమా చేశానని జగపతిబాబు అన్నాడు. సినిమా ప్రొడ్యూసర్ ఎమ్మెల్యే అయినా సరిగా ప్రమోషన్ చేయలేకపోయాడని చెప్పాడు. సినిమా బాగా రావాలనే తపన ప్రొడ్యూసర్ లో కనిపించలేదని జగపతిబాబు పేర్కొన్నాడు. అందువల్లే నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారని జగపతిబాబు తెలిపాడు. దాంతో మంచి సినిమా అనాథగా మారిపోయిందని తెలిపాడు. దాదాపు ఏడు, ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రుద్రంగి సినిమాను తెరకెక్కించారని, నాకున్న మార్కెట్‌కు ఆ రేంజ్ బడ్జెట్ వర్కవుట్ కాదని ముందే ఊహించానని జగపతిబాబు అన్నాడు. రిలీజ్ డిలే అవుతుండటంతో డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయమని ప్రొడ్యూసర్స్‌కు చెప్పానని, కానీ వినలేదని జగపతిబాబు అన్నాడు. రిజల్ట్ సంగతి పక్కనపెడితే రుద్రంగి తన కెరీర్ లో బెస్ట్ మూవీ అని జగపతిబాబు చెప్పాడు. జగపతిబాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.