షైన్ నిగమ్ , ఆంటోనీ వర్గీస్ , నీరజ్ మాధవ్ ప్రధాన పాత్రల్లో "ఆర్ డి ఎక్స్" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు నహస్ హిదియత్ దర్శకత్వం వహించగా ... సమ్ సిఎస్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ అంచనాలు నడుమ మలయాళ భాషలో ఈ సంవత్సరం ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది.

దానితో ఈ సినిమా 8 కోట్ల బడ్జెట్ తో రూపొంది ఏకంగా 100 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి మలయాళ ఇండస్ట్రీ లో ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ సినిమాల లిస్ట్ లో చేరిపోయింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ విజయం సాధించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు నుండి అనగా సెప్టెంబర్ 24 వ తేదీ నుండి తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రేమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమాకి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దామని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: