తని ఒరువన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు హీరో జయం రవి. అదే మూవీని తెలుగులోధ్రువగా రీమేక్ చేసి రామ్ చరణ్ కూడా మంచి హిట్ కొట్టారు.ఇక జయం రవి తమిళ నటుడే అయినా కూడా డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్గా జయం రవి నుంచి ఇరైవన్ మూవీ విడుదల కాబోతుంది. లేడీ సూపర్ స్టార్‌ నయనతారజయం రవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీని తెలుగులో గాడ్ అనే టైటిల్ తో థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన తని ఒరువన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.రీసెంట్ గా గాడ్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. నయనతార..జయం రవి సినిమాలకి సాధారణంగా సెన్సార్ నుంచి యూ సర్టిఫికెట్‌ వస్తోంది. కానీ గాడ్ మూవీకి A సర్టిఫికెట్‌ రావడంతో యూనిట్ సభ్యులతో పాటు..ఫ్యాన్స్ కు కూడా కాస్త షాక్ అయ్యారు.. ఈ మూవీలో హింసకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో..సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది.

లేటెస్ట్ గా ఈ మూవీకి  A సర్టిఫికెట్ రావడంతో హీరో జయం రవి స్పందిస్తూ..నేను ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా అన్ని వయసుల ప్రేక్షకులకు వినోదాన్ని పంచే విధంగా చేసినవే. కానీ, గాడ్ మూవీని మాత్రం పిల్లలతో కలిసి చూడకండి. ఎందుకంటే..ఈ సినిమాలో ఉన్న హింసాత్మక సీన్స్ కు పిల్లలు భయపడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీ మాస్ ఆడియన్స్కి, క్రైం థ్రిల్లర్ జోనర్ని ఇష్టపడే వారికి మాత్రం పెద్ద పండుగనే చెప్పొచ్చు .సైకో-క్రైమ్ థ్రిల్లర్‌ తో వస్తోన్న ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ క్యారెక్టర్లో జయం రవి ఇంటెన్సివ్ లుక్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. కమర్షియల్ యాంగిల్తో పాటు సమాజంలో జరిగే రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని మూవీని తెరకెక్కించడం జరిగింది..ట్రైలర్లో..అమ్మాయిలని టార్గెట్ చేసి, మర్డర్ చేసే సైకో కిల్లర్ మైండ్ సెట్ని డైరెక్టర్ ఎంతో క్లియర్గా చూపించారు.అమ్మాయిలని కిరాతకంగా చంపి..వారి బాడీ పార్ట్స్ని వేరు చేసి, ఆనందం పొందే ఓ సైకోని పట్టుకోవడానికి జయం రవి స్పెషల్ ఆఫీసర్గా..సీరియస్ ఇంటెన్స్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.ఐ అహ్మద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు...సైకో కిల్లర్ అమ్మాయిలని చంపే టైంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్  హైలైట్ గా ఉందని చెప్పొచ్చు. ఫ్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది

మరింత సమాచారం తెలుసుకోండి: