
ఏకంగా చిన్నపిల్లలను తీసుకుని మా సినిమా చూసేందుకు రాకండి అంటూ ప్రేక్షకులు అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు ఈ హీరో. ఆ హీరో ఎవరో కాదు జయం రవి.విభిన్నమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక జయం రవి ఒక సినిమా చేస్తున్నాడు అంటే చాలు ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉంటారు. అయితే మొన్నటికి మొన్న పోనియన్ సెల్వాన్ అనే సినిమాలో నటించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు జయం రవి. ఇక ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జయం రవి హీరోగా నయనతార హీరోయిన్గా నటించిన ఇరైవన్ విడుదలకు సిద్ధమవుతుంది.
తెలుగులో గాడ్ అనే టైటిల్ తో ఈ సినిమాను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. కాగా ఇటీవల సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది అని చెప్పాలి అయితే ఇలా సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై జయం రవి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అన్ని వయసుల ప్రేక్షకులకు వినోదాన్ని పంచే చిత్రాలు తాను చేస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తాను ప్రధాన పాత్రలో నటించిన ఇరైవన్ సినిమాకు మాత్రం చిన్న పిల్లలతో రావద్దు అంటూ సూచించాడు. ఎందుకంటే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి పిల్లలు భయపడే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కొంతమంది ప్రేక్షకులు మాత్రం ఈ జోనర్ ను ఎక్కువగా ఇష్టపడతారు అంటూ అభిప్రాయపడ్డాడు జయం రవి.