తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇక ఈ సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్లు అవుతున్నాయి తాజాగా వచ్చిన రంగా మార్తాండ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చినటువంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమా మురారి ఈ సినిమాలో మహేష్ బాబు సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించారు. ఇలా అప్పట్లో వచ్చినటువంటి మురారి సినిమా ఇప్పటికి ఎవర్ గ్రీన్ సినిమా గాని నిలిచిపోతుందని చెప్పాలి.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ఎత్తున దర్శక నిర్మాతల మధ్య గొడవ చోటు చేసుకుందని తెలుస్తుంది.  మురారి సినిమా కృష్ణవంశీకి నచ్చిన విధంగా తెరకెక్కించారు అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో బడ్జెట్ కారణంగా నిర్మాతలకు కృష్ణవంశీ మధ్య మనస్పర్ధలు వచ్చాయట ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఏకంగా మూడు గంటల పాటు రన్ టైమ్ ఉంది. సినిమా ఇంత నిడివి ఉంటే ప్రేక్షకులు ఎవరు చూడరని సినిమాకు చెడ్డపేరు వస్తుందని ఇందులో దాదాపు హాఫ్ ఆన్ అవర్ అయినా ఈ సినిమాని కట్ చేయమని కృష్ణవంశీకి నిర్మాతలు చెప్పారట ఇక మహేష్ బాబు కూడా ఇదే విషయం చెప్పడంతో కృష్ణ వంశీ ససేమిరా అన్నారు.  ఇలా సినిమాని కనుక కట్ చేసి విడుదల చేయాల్సి వస్తే దర్శకుడిగా నా పేరు మాత్రం తెరపై అసలు వేయొద్దు అంటూ ఈయన తెలియచేశారట. నిర్మాతలు కూడా మౌనంగా ఉంటూ ఈ సినిమాని విడుదల చేశారు. అయితే ఈ సినిమా ఏకంగా మూడు గంటల పాటు ఉండడంతో చాలామంది ఈ సినిమాలో కొన్ని సాగదీసే సీన్లు ఉన్నాయని చాలా బోర్ కొడుతుంది అంటూ ఈ సినిమాపై కామెంట్లు చేశారు. దీంతో నిర్మాతలు డైరెక్టర్ కు చెప్పకుండా దాదాపు అరగంట పాటు సినిమాని ఎడిట్ చేశారట దీంతో దర్శక నిర్మాతల మధ్య పెద్ద గొడవ జరగడమే కాకుండా క్రమక్రమంగా ఈ సినిమాని చూడటానికి వచ్చే వారి సంఖ్య పెరగడమే కాకుండా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కూడా సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: