దీంతో పలువురు అభిమానులు సైతం సోషల్ మీడియాలో ఆమె ఎవరు అనే విషయం గురించి తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే ఈమె పేరు అమృత చౌదరి ఈమె ఆంధ్రప్రదేశ్లోని భీమవరం జిల్లాలో పుట్టింది. ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది కాలేజ్ రోజుల్లోనే యాక్టింగ్ పరంగా ఎక్కువ మక్కువ ఉండటంతో పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగులలో కూడా నటించింది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే స్కంద సినిమాలో హీరోకి చెల్లెలి పాత్రలు నటించే అవకాశం రావడంతో నటించినట్టు తెలుస్తోంది.
పలువురు అభిమానుల సైతం ఈ సినిమాతో ఈమె దశ తిరిగిపోవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఏదో ఒక వీడియోతో ఫోటోలతో అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. హీరోయిన్లకు తీసుకొని అందంతో ఉన్నటువంటి అమృత చౌదరి ప్రస్తుతం కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటివరకు 22 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన స్కంద సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ తో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి మరి. రామ్ తన తదుపరిచిత్రమైన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్లో త్వరలోనే జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.