
డిసెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈ చిత్రం విడుదల తేదీని ఎప్పుడో అనౌన్స్మెంట్ చేశారు. అప్పటికి షారుక్ ఖాన్ నటించిన డంకి చిత్రం మాత్రమే డిసెంబర్లో విడుదల కావాల్సి ఉన్నది. బాలీవుడ్ చిత్రం కావడంతో పెద్దగా ఈ సినిమాని కెప్టెన్ మిల్లర్ చిత్ర బృందం పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు అనూహ్యంగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్ మూడో వారంలో విడుదల తేదీని కన్ఫామ్ చేసింది. పైగా జవాన్ సినిమాతో వెయ్యికోట్ల మార్కును అందుకున్న షారుక్ ఇప్పుడు సలార్, డంకీ సినిమాలు మధ్య విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది..
ఒక వారం రోజుల వ్యవధిలోనే కెప్టెన్ మిల్లర్ సినిమా వచ్చి కలెక్షన్స్ సాధించడం అంటే అది అసాధ్యమని సినీ ప్రేక్షకులు చెబుతున్నారు 2018లో ధనుష్ మారి-2 విడుదల చేయగా అప్పుడే కేజిఎఫ్ చాప్టర్ వన్ సినిమా విడుదలై పేను సంచలనాలను సృష్టించింది. ఇక మోహన్లాల్ షారుక్ జీరో వంటి సినిమాలు విడుదలైన మారి 2 బాగానే ఆకట్టుకుంది. అయితే బాలీవుడ్ నుంచి మేరీ క్రిస్మస్ అనే సినిమా కూడా డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎన్ని సినిమాలు అన్ని కూడా డిసెంబర్ నెలనే టార్గెట్ చేస్తూ ఉండడంతో మరి ఏ సినిమాలు సక్సెస్ అవుతాయో చూడాలి.