తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతో మంది దర్శకులు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన తక్కువ సినిమాల తోనే చాలా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలా దర్శకత్వం వహించిన చాలా తక్కువ సినిమాలతో తెలుగు పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఈయన పెళ్లి చూపులు మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే ఇటు ప్రేక్షకుల నుండి ... అటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరో సారి ప్రేక్షకులను అలరించాడు.

ఇక ఈ మూవీ తర్వాత తన ఫోకస్ ను సినిమా దర్శకత్వం పైన కాకుండా సినిమాల్లో నటించడానికి పై పెట్టాడు. అందులో భాగంగా అనేక సినిమాల్లో నటించిన ఈయన దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడుగా కూడా తనను తాను ఎంత గానో ప్రూవ్ చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కీడా కోలా అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కానుంది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి  రెస్పాన్స్ లభిస్తుంది. లేకపోతే ఇప్పటి వరకు ఈ మూవీ ట్రైలర్ కు 3.4 మిలియన్ వ్యూస్ మరియు 58 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి అలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: