బేబి చిత్రానికి సూపర్ మ్యూజిక్ ఇచ్చిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైందని మాస్ మూవీ మేకర్స్ ప్రకటించింది. అయితే, ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.ఈ నయా సినిమాకు సంబంధించి ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా వెల్లడించింది. కన్నీరు పెట్టుకుంటున్న వైష్ణవి చైతన్యను ఆనంద్ దేవరకొండ ఓదారుస్తున్నట్టు పోస్టర్లో కనిపిస్తోంది. ఇది కూడా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఉండే అవకాశం ఉంది.కాగా, ఈ ఏడాది జూలైలో రిలీజ్ అయిన బేబి సినిమా మంచి విజయాన్ని సాధించింది. చిరంజీవి, అల్లు అర్జున్ సహా చాలా మంది ప్రముఖుల ప్రశంసలను ఈ సినిమా పొందింది. కలెక్షన్లలోనూ సత్తాచాటింది. మొత్తంగా సుమారు రూ.95కోట్లకుపైగా కలెక్షన్లను బేబి సాధించింది. ఆహా ఓటీటీలోనూ ఈ సినిమా అదరగొట్టింది. ఓటీటీ రికార్డులను నెలకొల్పింది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి