తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కార్తీక్ సుబ్బరాజు కొంత కాలం క్రితం జిగర్ తండా అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళ భాషలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను రాబట్టింది. ఇలా ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో ఇదే సినిమాను తెలుగు లో దర్శకుడు హరీష్ శంకర్ ... మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా గద్దల కొండ గణేష్ అనే టైటిల్ తో రీమేక్ చేశాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఇప్పటికే జిగర్ తాండ సినిమా తమిళ ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు అయినటువంటి కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కొనసాగింపుగా "జిగర్ తాండ డబుల్ ఎక్స్" అనే పేరుతో ఓ సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో రాఘవా లారెన్స్ , ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో నటించారు.

మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థలలో ఒకటి అయినటువంటి జెమినీ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సినిమా విడుదల అయిన కొంత కాలానికి జెమినీ టీవీ లో తెలుగు భాషలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: