అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా లలో ''పుష్ప ది రూల్'' ఒకటి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీ లెవల్లో ఉన్నాయి.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి సుకుమార్సినిమా ను తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.. ఇక పార్ట్ 2 గురించి లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ డిఎస్పీ చెప్పిన మాటల తో మరిన్ని అంచనాలు పెరిగాయి.. సుకుమార్ పార్ట్ 2 కథ ను తనకు, చంద్రబోస్ కు చెప్పారని ఆ కథ విన్నప్పుడే ఆ స్క్రీన్ ప్లే ప్రతీ సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్ లాగ ఉంటుందని అన్నారు.

ఈ మాటలే ఇప్పుడు ఈ సినిమా పై మరింత హైప్ పెరిగేలా చేసాయి.. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కూడా ఈ మాటలు తేనే పోసినట్టు ఉన్నాయనే చెప్పాలి.. ఇలాంటి మాటలు కదా మాకు కావాల్సింది అంటూ ఆ క్లిప్ ను తెగ షేర్ చేసేస్తున్నారు.. దీంతో దేవి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక పుష్ప సినిమా లో జాతర సీక్వెన్స్ ఈ సినిమా కు హైలెట్ గా ఉండబోతుంది అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ జాతర ఎపిసోడ్ ఇప్పటికే షూట్ కూడా పూర్తి అయ్యింది.. కాగా ఈ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమా ను వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: