బిగ్ బాస్  మరియు నటుడు మానస్ వివాహం బుధవారం రాత్రి విజయవాడలోని మురళి రిసార్ట్స్ లో జరిగింది. మానస్ శ్రీజ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక మానస భార్య శ్రీజ గురించి చెప్పాలంటే ఈమె చెన్నైకి చెందిన అమ్మాయి. ఇక ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు పలువురు సీరియల్ నటీనటులు కొందరు ప్రముఖులు కొత్త జంటని ఆశీర్వదించారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇటు నటిజన్స్ సైతం కొత్త జంటని ఆశీర్వదిస్తున్నారు. వీరిద్దరికి సెప్టెంబర్ 2న నిశ్చితార్థం జరిగింది.

 గత మూడు రోజులుగా పెళ్లికి సంబంధించిన పనులను జరుపుతున్నారు. ఇందులో భాగంగానే హల్దీ ఫంక్షన్ కూడా నిర్వహించారు. వాటికి సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మానస్ గురించి చెప్పాలి అంటే బుల్లితెరపై మానస్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి. కొన్ని సినిమాలతో పాటు సీరియల్స్ సైతం చేస్తున్నాడు.. ప్రస్తుతం బ్రహ్మముడి అనే సీరియల్లో నటిస్తున్నాడు. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తన స్నేహితుడు అమర్ దీప్ కోసం స్టేజ్ పైకి వెళ్లి వచ్చాడు మానస్. ఇక అదే సమయంలో తన పెళ్లి నవంబర్ 22న అని తెలిపాడు.

అంతకు ముందు స్టార్ మా పరివార్ అవార్డ్స్ వేదికపై తన మొదటి శుభలేఖను యాంకర్ శ్రీముఖికి అందించాడు. మానస్, శ్రీజ వివాహం పెద్దలు కుదిర్చినదే. కోయిలమ్మ సీరియల్ ద్వారా బుల్లితెరపై క్రేజ్ దక్కించుకున్నాడు మానస్. ఆ తర్వాత పలు సీరియల్స్ ద్వారా అలరించాడు. ఆ తర్వాత బిగ్‏బాస్ సీజన్ 5 కంటెస్టెంట్‏గా హౌస్ లోకి ఫైనలిస్ట్ గా నిలిచాడు. తన మెచ్యూర్డ్ గేమ్ తో ఆ సీజన్ లో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బిగ్బాస్ షో తో భారీ గుర్తింపును తెచ్చుకున్న మానస్ తర్వాత కొన్ని ప్రైవేటు సాంగ్స్ సైతం చేశారో దానితోపాటు డాన్స్ షోలో సైతం పాల్గొన్నాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అలా ప్రస్తుతం మానస్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: