కోలీవుడ్లో టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా పేరుపొందిన నయనతార తాజాగా కొత్త అవతారం ఎత్తబోతోంది అంటూ పలు రకాల వార్తలు నిన్నటి రోజు నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఈమె కురియన్ అనే మలయాళం సినిమా ద్వారా నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. రౌడీ పిక్చర్స్ పేరుతో ఒక సినీ నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి నిర్మాతగా కూడా మారింది. అంతటితో ఆగకుండా పలు రకాల వ్యాపారాలతో ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతోంది నయనతార.

మరొక పక్క పలు రకాల వాణిజ్య ప్రకటనలను ప్రకటిస్తూ భారీగానే సంపాదిస్తూ ఉన్నారు. తన భర్త విగ్నేష్ శివన్ కూడా దర్శకుడు.. ప్రస్తుతం తన కవల పిల్లలతో అమ్మతనాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది నయనతార. తాజాగా హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత కలిగి ఉన్న పాత్రలోనే నటిస్తూ ఉన్నది నయనతార.. ప్రస్తుతం అన్నపూర్ణ అనే చిత్రంలో నటిస్తోంది ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన తెరపైకి రాబోతోంది. ఇదే విధంగా నయనతార నటిస్తున్న మరో సినిమా  మన్నాంగట్టి అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్స్ సందర్భంగా ఈమె కెమెరా వెనుక నిలబడి చూస్తున్న కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.


అయితే అందులో సరికొత్త అవతారం నమ్మండి అంటూ తెలియజేసింది. దీంతో నయనతార మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో అభిమానుల సైతం తెగ సంబరపడిపోయారు. అయితే ఇదంతా పబ్లిక్ సిటీ లేకపోతే నయనతార రాబోయే రోజుల్లో సినిమాలకు దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతోందా అనే ప్రశ్న అభిమానులలో వైరల్ గా మారుతోంది. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలపై తాను ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ విషయం తెలిసి పలువురు అభిమానులు సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ఇదంతా కూడా సినిమా పబ్లిసిటీ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: