కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన హీరో విశాల్ ఎప్పుడూ కూడా యాక్షన్ సినిమాలోనే తెరకెక్కిస్తూ ఉంటారు. తన కెరియర్లో పందెంకోడి పొగరు వంటి యాక్షన్ సినిమాల తర్వాత టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది విశాల్.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోయారు ఇటీవల వచ్చిన మార్క్ ఆంటోని చిత్రం కోలీవుడ్ లో 100 కోట్ల రూపాయలను అందుకోవడం జరిగింది. అయితే విషయాల అభిమానులు మాత్రం కోరుకుంటున్నది ఒక పవర్ యాక్షన్ మూవీ అన్నట్లుగా తెలుస్తోంది.ఇప్పుడు తాజాగా యాక్షన్ సినిమా కోసం డైరెక్టర్ హరి దర్శకత్వంలో విశాల్ రత్నం అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. గతంలో ఈ డైరెక్టర్ సింగం సిరీస్ లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగింది. విశాల్ తో కూడా పూజ అనే సినిమాను చేయడం జరిగింది. ఈ చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలని అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక డ్రామా కాన్సెప్ట్ తో రత్నం సినిమాని తెరకెక్కిస్తూ టీజర్ ని సైతం విడుదల చేస్తూ టైటిల్ ని రీవిల్ చేయడం జరిగింది.


రాజా గారి రిలీజ్ అయిన టీజర్ చూస్తూ ఉంటే విశాల్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక మైదానంలో గుర్రాలు దున్నపోతులు పరిగెడుతూ ఉండగా వాటి మధ్య నుంచే విషయాలు లారీ నుంచి వచ్చి దిగి మరి దేవుడిని దర్శించుకొని మోకాళ్ల మీద కూర్చుంటే ఒక దుండగుడి తల నరకడాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆ తలని చేత్తో పట్టుకొని నడిచి వచ్చే సన్నివేశం ఈ టీజర్ పైన ఆసక్తి పెంచేలా చేస్తోంది. మరి ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి స్టోరీని మాత్రం రిలీజ్ చేయలేదు చిత్ర బృందం. విశాల్ మాత్రం ఈ సినిమాలో చాలా మాస్ లెవెల్ లో క్యారెక్టర్ ఉండబోతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: