స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత పుష్ప -2 సినిమా మరింత పవర్ ఫుల్ గా తెరకెక్కించేందుకు డైరెక్టర్ సుకుమార్ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పుష్ప సినిమా కంటే ఈసారి మరింత హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిలో పడ్డారు. ఎక్కువగా సెలవులు తీసుకోకుండా సండేలు కూడా వర్క్ చేస్తూ సినిమా షూటింగ్ కోసం చాలా కష్టపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల చేయాలని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చిత్ర బృందం.


ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల అప్డేట్లు అప్పుడప్పుడు అభిమానులను బాగా ఆకట్టుకునేలా చేస్తూ ఉంటాయి. అయితే చాలా రోజులుగా పుష్ప-2 సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నదట. రీసెంట్గా అయితే వారం రోజులపాటు గ్యాప్ లేకుండా పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఇందులో ఒక పాటను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. హఠాత్తుగా ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి డిసెంబర్ రెండవ తేదీ నుంచి కొద్దిరోజుల పాటు బ్రేక్ ఇవ్వబోతున్నారట.

ఎందుకంటే అల్లు అర్జున్ కు వెన్ను నొప్పితో పాటు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా రెస్ట్ తీసుకొని మళ్లీ సినిమా షూటింగ్ కు పాల్గొని అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా కోలుకొని షూటింగ్లో పాల్గొనాలని అల్లు అర్జున్ డిసైడ్ అయినట్లుగా సమాచారం .ఒక వారం గ్యాప్ తీసుకొని వచ్చే వారంలో ఈ సినిమా షూటింగ్లో పాల్గొనాలని నిర్మాతలు సైతం బన్నీ సూచించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 300 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 ఈ సినిమాని విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: