'యానిమల్' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై అన్ని చోట్ల హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఎప్పటిలాగే సందీప్ వంగ తన మేకింగ్ లో కల్ట్ వెర్షన్ ని చూపించడంతోపాటు ఈసారి వైలెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 'A' సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాకి ప్రేక్షకుల నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం బహుశా ఇదే మొదటిసారి ఏమో. అందుకే సౌత్ తో పాటు నార్త్ లోనూ

 డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సినిమాలో రణబీర్ తన నట విశ్వరూపం చూపించారు. దీంతో రణ్ బీర్ యాక్టింగ్ పై ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాతో హీరోగా రణ్ బీర్ కి ఎంత పేరొచ్చిందో, డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా కి అంతకంటే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. కేవలం మూడో సినిమాకే అటు ఇండస్ట్రీలోనూ ఇటు ఆడియన్స్ లోను ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. రాజమౌళి లాంటి డైరెక్టర్ కే ఇది సాధ్యం కాలేదు. ఎలాంటి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా సందీప్ వంగా ఈ సినిమాని తెరకెక్కించడం విశేషం.

 ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో ఈ సినిమా అనూహ్య స్పందన కనిపిస్తోంది. దీంతో దర్శకుడిగా సందీప్ కి మాస్ లోనూ భారీ క్రేజ్ వచ్చేసింది. యానిమల్ మూవీ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగాని ఎక్కడో నిలబెట్టింది. ఈ మూవీ సక్సెస్ తో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ రాజమౌళి, సుకుమార్ సరసన చేరిపోయాడని చెప్పడంలో సందేహం లేదు. అర్జున్ రెడ్డి తో టాలీవుడ్ లో తన మార్క్ చూపించిన సందీప్ రెడ్డి ఇప్పుడు యానిమల్ తో నార్త్ లో సత్తా చాటాడు. ఇతని కంటే ముందు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కూడా 'జవాన్' తో అదే చేశాడు. అయితే నార్త్ లో అట్లీ కంటే ఎక్కువ సందీప్ రెడ్డి వంగాకే క్రేజ్ వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: