ఈసినిమా సెకండ్ పార్ట్ ‘హిట్ 2’ విజయవంతం కావడమే కాకుండా ఈసినిమాలో నటించిన అడవి శేషుకు మంచి పేరు కూడ వచ్చింది. ఈసినిమా చివరిలో ఈదర్శకుడు ‘హిట్ 3’ గురించి లీకులు ఇవ్వడమే కాకుండా ఆమూవీలో నాని హీరోగా నటిస్తున్న విషయానికి సంబంధించి కొన్ని సీన్స్ కూడ చూపెట్టాడు. దీనితో ఈమూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అన్న ఆశక్తి చాలమందిలో ఏర్పడింది.
ఈసినిమాకు నాని నిర్మాతగా కూడ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘హిట్ 2’ రిలీజ్ అయి సంవత్సరం దాటిపోయినా ‘హిట్ 3’ గురించి క్లారిటీ రావడంలేదు. ప్రస్తుతం శైలేష్ కొలను తీసిన ‘సైంధవ్’ సంక్రాంతి రేస్ లోకి ఎంటర్ అయింది. ఈసినిమా ఫలితం తెలియాలి అంటే సంక్రాంతి గడిచిపోవాలి.
ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శైలేష్ కొలను ‘హిట్ 3’ గురించి ఒక ఆశక్తికర విషయాన్ని తెలియచేశాడు. ఈసినిమా ప్రారంభం అవ్వడానికి మరో సంవత్సరం పైన పట్టినా ఆశ్చర్యం లేదు అంటూ లీకులు ఇచ్చాడు. ప్రస్తుతం నాని వరస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆసినిమాలు పూర్తి అవ్వడానికి ఒక సంవత్సర కాలం పడుతుందని అప్పుడు మాత్రమే ‘హిట్ 3’ ఆలోచన అని అంటున్నాడు. దీనికితోడు ఈసినిమాకు సంబంధించిన లైన్ ఓకె అయింది కానీ ఇంకా పూర్తి స్క్రిప్ట్ రెడీ కాలేదు అంటున్నాడు. ‘సైంధవ్’ తరువాత తన జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక మంచి ప్రేమ కథను రాశానని దానిని కూడ సినిమాగా తీయాలని తన లక్ష్యం అని అంటున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి