టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన సైంధవ్ మీద ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. హిట్ ఫ్రాంచైజీతో ఆకట్టుకున్న శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ రోజే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.సైందవ్ మూవీ హాలీవుడ్ తరహా లాంటి యాక్షన్ మూవీ. ఈ తరహాలో వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఇప్పుడు సైంధవ్ సినిమా కూడా ఆ తరహా కథే. సైంధవ్ లో శైలేష్ కొలను బెటర్ స్టోరీనే ఎంచుకున్నాడు. తండ్రి కూతురు ఎమోషన్.. 17 కోట్ల రూపాయల ఇంజక్షన్.. స్మగ్లింగ్ మాఫియాతో హీరో కనెక్షన్.. ఇలా సెటప్ అంతా బాగానే కుదిరింది. కానీ హీరో పాత్రకు అవసరమైన బిల్డప్.. ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం సరిగా జరగలేదు. దీనికి తోడు నవాజుద్దీన్ సిద్ధిఖి లాంటి విలక్షణ నటుడు ఉన్నా కూడా.. విలన్ పాత్రలో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. ఆ క్యారెక్టర్ని ఒక జోకర్ తరహాలో తీర్చిదిద్దడం వల్ల దాన్ని చూసినప్పుడల్లా కామెడీగా అనిపిస్తుంది తప్ప భయం, క్యూరియాసిటి కలగవు.అదే సైంధవ్ సినిమాకు అతి పెద్ద సమస్యగా నిలిచింది.


 ఇప్పుడంతా  కొత్త దనం కోరుకునే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ట్రెండుగా మారిన నేపథ్యంలో శైలేష్ చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ సిటీనైతే క్రియేట్ చేశాడు కానీ అందులో వావ్ అనిపించేలా చేయలేకపోయాడు.సైంధవ్ సినిమా గురించి గొప్పగా చెప్పుకోవాలంటే అది వెంకీ పెర్ఫార్మెన్స్.. ఆయన చేసిన యాక్షన్ విన్యాసాలే. పాత్రల పరిచయం.. తండ్రి కూతుళ్ల మధ్య బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో సాగే తొలి అర గంట మాత్రం నెమ్మదిగా అనిపిస్తుంది.మొత్తానికి తెలుగు సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించేలా యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. అయితే ఈ యాక్షన్ సన్నివేశాలకు అవసరమైన బిల్డప్ అయితే మాత్రం అన్నిచోట్ల కుదరలేదు.  రెండు చోట్ల మాత్రం ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అయింది. వెంకీ తన పెర్ఫామెన్స్ తో ఆ సన్నివేశాలను గట్టిగా నిలబెట్టాడు. అయితే విలన్ పాత్రకు సరైన ఎలివేషన్ ఇచ్చి ఉంటే చివరికి సైంధవ్ మంచి స్థాయిలో నిలబడేది. కానీ ఆ పాత్రను తేల్చి పడేయడం మాత్రం నిరాశ కలిగిస్తుంది. మొత్తానికి సినిమాని వెంకటేష్ కోసం చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: