తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ క్యూట్ కపుల్ గా కొనసాగుతూ ఉన్నారు అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు. ఈ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. ఏ ఫ్యామిలీ ఫంక్షన్లో కనిపించిన కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి మగవాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే అల్లు అర్జున్ ని స్నేహారెడ్డి ప్రోత్సాహించడం వల్లే ఇక ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ వరకు ఎదిగాడు అని ఎంతోమంది బన్నీ అభిమానులు కూడా అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే అలాంటి స్నేహారెడ్డి ఒక హీరోయిన్ తో నటించకూడదు అని తన భర్త అల్లు అర్జున్ ను ఒక కండిషన్ పెట్టింది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప తో సూపర్ సక్సెస్ అందుకొని.. ఇక ఈ సినిమా సీక్వెల్ చేస్తూ ఉన్నాడు. ఈ మూవీపై కూడా భార్య రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ముగిసిన తర్వాత ఇక బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు స్నేహారెడ్డి ఒక విషయంలో కండిషన్ పెట్టిందట. ఒకరకంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చిందట. బన్నీ త్రివిక్రమ్ సినిమాలో ఇక బన్నితో రొమాన్స్ చేసేందుకు.. తృప్తి దిమ్రీని సెలెక్ట్ చేశారట మేకర్స్. దీంతో స్నేహకు కోపం వచ్చిందట.


 నువ్వు ఆ హీరోయిన్ తో నటించోద్దు అంటూ బన్నీకి వార్నింగ్ ఇచ్చిందట. నువ్వు తనతో నటించడం నాకు ఇష్టం లేదు అని మొహం మీద చెప్పేసిందట. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు. యానిమల్ మూవీలో తృప్తి ఎలాంటి బోల్డ్ రోల్ లో నటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇలా యానిమల్లో తృప్తి పాత్ర చూసిన తర్వాత స్నేహ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుందట. అయితే అటు అల్లు అర్జున్ కూడా భార్య నిర్ణయాన్ని గౌరవించి ఇక తృప్తికి బదులు మరో హీరోయిన్ ను సినిమాలోకి సెలెక్ట్ చేయాలని మేకర్స్ కు సూచించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: