ఫిబ్రవరి నెలలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా జరగబోతున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాబోతోంది. దేనితో తెలుగు రాష్ట్రాలలో ఇంకా సమ్మర్ రాకుండానే వాతావరణం వేడెక్కబోతోంది. దీనితో సినిమాల గురించి జనం పెద్దగా పట్టించుకోకపోవచ్చును అన్న అంచనాలు ఉన్నాయి.



అయినప్పటికీ ఫిబ్రవరి 8వ తారీఖునాడు సినిమాల వార్ జరగబోతోంది. రవితేజా నటించిన ‘ఈగల్’ మూవీతో పాటు ‘యాత్ర 2’ కూడ విడుదల కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయుకుడి హోదాలో కొన్ని సంవత్సరాల క్రితం చేసిన పాదయాత్ర నేపధ్యంలో ‘యాత్ర 2’ మూవీని తీశారు. దర్శకుడు మహీ వి. రాఘవన్ ఆరోజులలో జగన్మోహన్ రెడ్డి  చేపట్టిన పాద యాత్రతో అధికారంలోకి ఎలా వచ్చారు అన్న అంశం చుట్టూ ఈమూవీ కథ తిరుగుతుంది.



తమిళ హీరో జీవా ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పాత్రను పోషిస్తున్నాడు.  దర్శకుడు మహి వి రాఘవ్ ప్రధానంగా ఓటర్ల ఎమోషన్లను ఆకట్టుకునే ప్రయత్నం ఈమూవీలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశస్థుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ ఆర్ పార్టీ తెలుగుదేశం జనసేన ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితులలో ‘యాత్ర 2’ హిట్ కావడం అన్నది చాల కీలకం. దీనితో వైసిపి శ్రేణులు ఈ సినిమా రిలీజయ్యాక దీన్ని తమ భుజాలపైకి ఎత్తుకుని మరీ ప్రమోట్ చేస్తారను వార్తలు వస్తున్నాయి.



ఈసినిమాకు సంబంధించి కొన్ని స్పెషల్ షోలు ఉచితంగా వేసి ఆ షోల ఖర్చును వైఎస్ఆర్ పార్టీ నాయకులు భరించి ఆ పార్టీ క్యాడర్ కు ఆమూవీని చూపించే విధంగా వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. దీనితో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి మ్యానియాను క్రియేట్ చేస్తుంది అన్న విషయమై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా నటించిన ‘యాత్ర’ మూవీకి సగటు ప్రేక్షకుడి నుండి కూడ మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే..














మరింత సమాచారం తెలుసుకోండి: