అయితే ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించింది. విజయ్ సరసన సినిమా అవకాశం వస్తే బాగుండు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో డిజాస్టర్ చెవి చూసింది. అయితే రిలీజై ఫ్లాప్ అయినా చాలా రోజులకు ఇటీవల తమన్నా ఈ మూవీపై తీవ్ర విమర్శలు చేసింది. అది కూడా ఓ సినిమానేనా అంటూ హేళనగా మాట్లాడింది. ఈ సినిమాలో నటించి నేను పెద్ద తప్పు చేశాను.. ఆ సినిమా వర్కౌట్ కాదన్న విషయం నేను ముందే గ్రహించా.. అయితే తప్పక ఈ సినిమాలో నటించాల్సి వచ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
సౌత్ లోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న తమన్నా.. తాను నటించిన ఓ సినిమాపై ఇలాంటి కామెంట్స్ చేయడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే తమన్నా కోలీవుడ్‌లో ఇప్పటికే విజయ్, అజిత్, సూర్య, ధనుష్, కార్తీ లాంటి స్టార్ హీరోల సరసన జతకట్టి భారీ పాపులారిటి దక్కించుకుంది. ఇక ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ సినిమాలో నటించిన సంగతి తెలిసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర నడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఒక్క నువ్వు కావాలయ్యా.. సాంగ్ తోనే సినిమా మొత్తంలో హైప్ పెంచేసింది. అయితే తర్వాత తమన్నకి కోలీవుడ్‌లో అవకాశాలు రాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి