ప్రస్తుతం ఎవరు అవునన్నా కాదన్నా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు అటు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గాకొనసాగుతుంది నయనతార. ప్రస్తుతం హీరోయిన్లు అందరిలో కూడా ఈ అమ్మడు ఒక బ్రాండ్ అన్నట్లుగా హవా నడిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక నయనతారని సినిమాలో పెట్టుకున్నాము అంటే చాలు ఇక కలెక్షన్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయని అటు ఎంతో మంది దర్శక నిర్మాతలు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోయిన్ ను సినిమాలో పెట్టుకోవడానికి తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక నయనతార కూడా మిగతా హీరోయిన్లతో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే పారితోషికం డిమాండ్ చేస్తుంది. అయినప్పటికీ అటు నిర్మాతలు ఎక్కడ వెనక్కి తగ్గకుండా భారీగా పారితోషకం ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతు ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే మంచి క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాల్లో భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటూనే.. ఇంకోవైపు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్నారు.



 అయితే ప్రస్తుతం ఇక సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార.. సైతం పలు వాణిజ్య ప్రకటనల్లో మెరుస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఏకంగా 50 సెకండ్ల నిడివి గల ఒక వాణిజ్య  ప్రకటన కోసం నయనతార తీసుకున్న పారితోషకం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అందరూ హీరోయిన్లు ఏకంగా సినిమా మొత్తంలో నటించడానికి రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటుంటే అటు నయనతార మాత్రం కేవలం 50 సెకండ్లు యాడ్ కోసం ఐదు కోట్లు పారితోషకం తీసుకుంటుదట  దీంతో ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: