ప్రతిసారి సంక్రాంతి పండగ దగ్గరకు వచ్చింది అంటే చాలు తెలుగు సినీ పరిశ్రమలో గందరగోళ వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది. దానికి ప్రధాన కారణం స్టార్ హీరోలు నటించిన సినిమాలు... పెద్ద బ్యానర్లు నిర్మించిన సినిమాలు ఎక్కువ శాతం సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అని అనుకుంటారు. దానితో థియేటర్ల కొరత ఏర్పడడం, థియేటర్లు దొరికిన సినిమాలకు మంచి థియేటర్లు దొరకలేదు అని ప్రేక్షకుల నుండి అభిప్రాయాలు రావడం ఇలా అనేక కారణాలవల్ల సంక్రాంతి పండుగ సమయంలో సినీ పరిశ్రమలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి.

ఇక వచ్చే సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వచ్చే సంవత్సరం సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయనున్నట్లు కొన్ని మూవీ యూనిట్స్ ప్రకటిస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా మొదటగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసింది.

ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అనౌన్స్ చేసింది. ఇలా ఇప్పటికే రెండు క్రేజీ తెలుగు సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలవనున్నట్లు ప్రకటించగా తాజాగా రవితేజ కూడా ఈ లిస్టులో చేరిపోయాడు. తాజాగా "రవితేజ 75" మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. సంక్రాంతికి చాలాకాలం ముందే ఈ సీజన్ కు మూడు సినిమాలు పోటీకి రెడీ అయ్యాయి. రాబోయే రోజుల్లో సంక్రాంతి సీజన్ లోకి మరిన్ని సినిమాలు వస్తాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: