ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులందరినీ మాయ చేసి తన బుట్టలో వేసుకుంది. ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. కేవలం గ్లామర్ పాత్రలు చేయడమే కాదు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేసుకుంటూ తనలో ఉన్న నటిని ఇప్పటికే నిరూపించుకుంది.


 మరి ముఖ్యంగా చాలెంజింగ్ రోల్స్ చేయడంలో సమంత ఎప్పుడు ముందుంటుంది అని చెప్పాలి. ఇక ఇలా సమంత కెరియన్ లో చేసిన ఛాలెంజింగ్ రోల్స్ లో రంగస్థలం మూవీలోని రామలక్ష్మి పాత్ర కూడా ఒకటి.  ఎంతో అందంగా క్యూట్ గా కనిపించే సమంత అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయిలాగా నటించి అందరిని మెప్పించగలిగింది. రామలక్ష్మీ పాత్రలో సమంత పండించిన హావ బావాలకు ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఆ పాత్రను సమంత తప్ప మరొకరుచేసి ఉంటే ఈ రేంజ్ లో పాత్ర పండేది కాదు అని అభిమానులు అనుకున్నారు. అయితే ఈ పాత్రకు సమంతను సెలెక్ట్ చేయడం విషయం గురించి షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ సుకుమార్.



 షూటింగ్లో సమంతను మేనేజ్ చేయడం కష్టమని భావించాడట డైరెక్టర్ సుకుమార్. ఈ క్రమంలోనే రంగస్థలం మూవీ కోసం సమంతను సెలెక్ట్ చేయడం విషయంలో కాస్త వెనక ముందు అయ్యాడట. ఇక సమంతను సెలెక్ట్ చేయకూడదని కూడా నిర్ణయం తీసుకున్నాడట. కానీ షూటింగ్ సమయంలో సమంత నటన చూసి సుకుమార్ ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయాడట. ప్రతి సీన్లో ఆమె పండించిన హావభావాలు అద్భుతం సుకుమార్ ప్రశంసలు కురిపించాడు. ఇక రంగస్థలంలో రామలక్ష్మీ పాత్రకు సమంత కాకుండా మరొకరిని తీసుకొని ఉంటే న్యాయం చేయలేకపోయేవారు అంటూ సుకుమార్ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: