నాచురల్ స్టార్ నాని తన కెరియర్ లో ఎన్నో ప్రేమ కథ చిత్రాలలో హీరోగా నటించాడు. అలా నాని నటించిన ప్రేమ కథ చిత్రాలలో "ఎటో వెళ్లిపోయింది మనసు" సినిమా ఒకటి . ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించగా ... శ్రీ కళ్యాణ్ ఈ మూవీ ని నిర్మించాడు . ఇందులో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత , నాని కి జోడి గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆ సమయంలో పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. 

కానీ ఈ సినిమాకు బుల్లి తెరపై మాత్రం మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది . అలా ఈ సినిమా ఆ సమయంలో థియేటర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకో లేక పోయినప్పటికీ ఇప్పటికీ కూడా బుల్లి తెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉండటం తో ఈ సినిమాను మరో సారి థియేటర్ లలో రిలీజ్ చేస్తే అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది అని ప్రేక్షకులు ఎప్పటి నుండో తమ అభిప్రాయాల ను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఇక పోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాని త్వరలోనే రీ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు రీ రిలీస్ అయ్యి అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆలరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడం ... ఈ మూవీ రీ రిలీస్ అయితే బాగుంటుంది అని ఎప్పటి నుండో ప్రేక్షకులు కోరుకుంటూ ఉండడంతో ఈ సినిమాకు కూడా రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్ లు దక్కే అవకాశాలు చాలా వరకు ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: